Kaalam: రామ్ గణపతి హీరోగా నటిస్తున్న “కాలం” మూవీ ట్రైలర్ లాంఛ్
ఇఈ, రాజయోగం వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు రామ్ గణపతి. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా “కాలం”. ఈ సినిమాను శ్రీ నవబాల క్రియేషన్స్, 3 కీజ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మణి లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. మిట్టపెల్లి రాజేష్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్ గణపతి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వెంకట సురేష్. ఆర్. రూపొందిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన “కాలం” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో సాయి రోనక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నిర్మాత మణి లక్ష్మణరావు మాట్లాడుతూ – మా “కాలం” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ రోజు మా ఈవెంట్ కు గెస్ట్ లుగా వచ్చిన ఎంఎం శ్రీలేఖ, సాయి రోనక్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో నిర్మించాం. ఉత్తరాఖండ్ నైనిటాల్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే చిత్రమిది. మీరంతా “కాలం” సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ వెంకట్ సురేష్.ఆర్. మాట్లాడుతూ – “కాలం” సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం హ్యాపీగా ఉంది. హీరో రామ్ గణపతి, ప్రొడ్యూసర్ మణి లక్ష్మణరావు గారికి థ్యాంక్స్. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాను జాగ్రత్తగా చూడకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. మా మూవీ కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థం కావాలంటే అన్ని సన్నివేశాలను మిస్ కాకుండా చూడాలి. అన్నారు.
హీరోయిన్ అంకిత సాహా మాట్లాడుతూ – నేను గతంలో రామ్ గణపతి గారి దర్శకత్వంలో రాజయోగం సినిమాలో నటించాను. మళ్లీ “కాలం” చిత్రంలో ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తున్నాను. రామ్ గణపతి గారు మంచి దర్శకుడే కాదు మంచి నటుడు కూడా. ఆయన హీరోగా అరంగేట్రం చేస్తున్న ఈ సినిమా విజయం సాధించాలి. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
అతిథిగా వచ్చిన హీరో సాయి రోనక్ మాట్లాడుతూ – “కాలం” సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. రామ్ గణపతి గారితో నేను కలిసి వర్క్ చేశాను. ఆయన ఆలోచనలు యూనిక్ గా ఉంటాయి. ఈ సినిమాను కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందించారు. రామ్ గణపతి గారిలోని ఎనర్జీ మా అందరినీ ఇన్స్ పైర్ చేసేది. ఈ సినిమాలో అంకిత్ సాహా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె నాతో రాజయోగం మూవీ చేసింది. మంచి ప్రొఫెషనల్ హీరోయిన్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నా. ఎంటైర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
అతిథిగా వచ్చిన ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ – రామ్ గణపతి గారు దర్శకత్వంలో వచ్చిన రాజయోగం సినిమాలో నేనొక సాంగ్ కంపోజ్ చేశాను. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. టైమ్ ట్రావెలింగ్ అంటే కొంత కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రానికి సరైన ముగింపు ఉంటుందని అనుకుంటున్నా. చిన్న చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ కాలం సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో రామ్ గణపతి మాట్లాడుతూ – నేను గతంలో పాపిల్స్ అనే ఇంటర్నేషనల్ టీవీ సిరీస్ రూపొందించాను. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఉంది. టాలీవుడ్ కు వచ్చి దర్శకుడిగా ఇఈ అనే మూవీ చేశాను. అది అంతగా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ఆ తర్వాత రాజయోగం మూవీ రూపొందించాను. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు కాలం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నా. ఈ చిత్రంలో దాదాపు అందరూ కొత్తవాళ్లే వర్క్ చేస్తున్నారు. 14 ఏళ్ల హమ్మీ అనే అబ్బాయి మ్యూజిక్ ఇచ్చాడు. ఆయన చేసిన బీజీఎం, రెండు సాంగ్స్ మీకు గుర్తుండిపోతాయి. మా రాజయోగం హీరోయిన్ అంకిత్ సాహా ఈ చిత్రంలో నాకు జోడీగా నటించింది. ఆమె తన నటనతో ఆకట్టుకుంటుంది. వెంకట సురేష్ ఎస్ జే సూర్య దగ్గర వర్క్ చేశారు. ఆయన మా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంతో కాలం సినిమాను రూపొందించాం. ఈ సినిమా ఒక కొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను ఆడియెన్స్ కు అందిస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎంతో కష్టపడి చిన్న చిత్రాలు రూపొందిస్తాం. సినిమా మేకింగ్ లో మేము పడే కష్టాన్ని మీరు ఊహించలేరు. నా రాజయోగం సినిమాకు కొందరు ఘోరమైన రివ్యూస్ ఇచ్చారు. చిన్న చిత్రాలు బతకాలంటే మీడియా, రివ్యూయర్స్ సపోర్ట్ కావాలి. రివ్యూయర్స్ చిన్న సినిమాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.






