గూగుల్ త్వరలో ఏఐ అసిస్టెంట్

ప్రాజెక్ట్ అస్త్ర పేరుతో కొత్త మల్టీమాడల్ కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ కొత్త ఏఐ అసిస్టెంట్‌ను మనం టెక్ట్స్, ఆడియో, వీడియో ద్వారా ప్రశ్నలు అడగొచ్చు. ఈ ప్రశ్నలకు రియల్ టైమ్‌లో అప్పటికప్పుడే ఇది సమాధానాలు ఇస్తుంది. గదిలోని వస్తువులను కూడా ఇది గుర్తిస్తుంది. కిటికీ బయటకు చూసి అది ఏ ప్రదేశమో చెప్పేస్తుంది. వస్తువులు ఎక్కడున్నాయో పసిగడుతుంది. అనేక పనులను చేయగలిగే ఈ ఏఐ అసిస్టెంట్‌లోని ఫీచర్లను పరిచయం చేస్తూ గూగుల్ ఒక డెమో వీడియోను విడుదల చేసింది. దీనిని స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌గ్లాసెస్ నుంచి కూడా వినియోగించుకోవచ్చని, జెమినీ యాప్‌తోనూ దీనిని అనుసంధానం చేయనున్నట్టు పేర్కొన్నది. ఈ కొత్త ఏఐ అసిస్టెంట్ గొంతును సహజసిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దినట్టు గూగుల్ తెలిపింది.