టాప్ సీఈవోలతో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ భేటీ
ప్రపంచ ప్రధాన వ్యాపార కంపెనీల సీఈవోలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. న్యూయార్క్ నగరంలో జరిగిన ఈ సమావేశంలో ఇటీవలే ప్రకటించిన గతిశక్తి ప్రణాళిక, డిజిటలైజేషన్, మేకిన్ ఇండియాతో పాటు పలు ఈ సమావేశంలో ఆమె వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టాప్ సీఈవోల్లో మాస్టర్‌కార్డ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అజయ్‌బంగా, మాస్టర్‌కార్డ్ సీఈవో మైకేల్ మిబాచ్ ఉన్నారు. డిజిటల్ రూపొంతరత చర్చలో భాగంగా ఉందని ఆర్థిక శాఖ పేర్కొంది. మరోవైపు ఫెడ్ఎక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) రాజ్సుబ్రమణియంతో కూడా సీతారామన్ భేటీ అయ్యారు. మాస్టర్ ప్లాన్ గతిశక్తితో భాగస్వామ్యమవ్వాలని రాజ్ సుబ్రమణియమ్‌ను సీతారామన్ కోరారు. సిటీగ్రూప్ సీఈవో జేన్ ప్రాసెర్తో కూడా సీతారామన్ చర్చించారు.
మేకిన్ ఇండియా దిశగా అడుగులు వేయాలని బ్యాంకింగ్ కంపెనీ సిటీగ్రూపును ఆమె కోరారు. డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టాలని, ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని కోరారు. ఈ మేరకు ఆర్థిక శాఖమంత్వ్రిశాఖ తెలిపిది. అనంతరం ఐబీఎం చైర్మన్, సీఈవో అరవింద్ క్రిష్ణతో సీతారామన్ భేటీ అయ్యారు. భారత్‌లో క్లౌడ్, ఆటోమేషన్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, డేటా, ఏఐ వంటి విభాగాల్లో ఐబీఎం ఆసక్తిగా ఉందని ఆర్థిక శాఖ తెలిపింది. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు సీతారామన్ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.






