టిక్‌టాక్‌కు మరో షాక్
చైనాకు చెందిన సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌కు మరో షాక్ తగిలింది. పొరుగు దేశం నేపాల్ ఆ యాప్‌పై నిషేధం విధించింది. యాప్ వల్ల దేశంలో సామరస్యం దెబ్బతింటోందని పేర్కొంది. ఈ మేరకు నేపాల్ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఈ యాప్‌తో సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న కారణంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తమ అనుబంధ కార్యాలయాలను నేపాల్‌లో ఏర్పాటు చేయాలని ఇదే కేబినెట్ భేటీలో నిర్ణయించారు. త్వరలో నిర్దిష్ట గడువు నిర్ణయించి ఆపై నిషేధం అమలు చేస్తామని రేఖా శర్మ స్పష్టం చేశారు.






