Shrimp : 40 వేల టన్నుల రొయ్యల ఎగుమతులకు సన్నాహాలు

అమెరికా ప్రతీకార సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపేయడంతో, ఆ దేశానికి 35,000-40,000 టన్నుల రొయ్యల (Shrimp)ను ఎగుమతి చేసేందుకు భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదార్లు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా (America) ఎగుమతి చేసేందుకు, పోటీ దేశాలతో పోలిస్తే భారత ఎగుమతిదార్లకు ఊరట లభించింది. అధిక సుంకాల (High tariffs) భయంతో నిలిపిన ఎగుమతులను, తిరిగి పంపించేందుకు సిద్ధమవుతున్నామని సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి కె.ఎన్ రాఘవన్ (K.N. Raghavan) తెలిపారు. ఇప్పటికే ఆలస్యమైన దాదాపు 2,000 కంటెయినర్ల రొయ్యలను అమెరికాకు రవాణా చేసేందుకు సిద్ధం చేశామని తెలిపారు. ప్రస్తుతం భారత్ (India) నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రొయ్యలపై 17.7 శాతం కస్టమ్స్ సుంకం పడుతోంది.