త్వరలో మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్

మొబైల్ గేమ్స్ విషయంలో గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్‌లు అధిపత్యం కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటి నుంచే గేమ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అతి పెద్ద గేమింగ్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ మొబైల్ గేమింగ్ మార్కెట్‌లో మాత్రం వెనుకబడి ఉంది. ఇప్పుడీ సంస్థ సొంత మొబైల్ గేమింగ్ స్టోర్‌ను ప్రారంభించనుంది. ఎక్స్‌బాయ్స్ మొబైల్ గేమింగ్ స్టోర్ ద్వారా గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ ఇవ్వాలని మైక్రోస్టాప్ భావిస్తోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎక్స్‌బాక్స్ ప్రెసిడెంట్ సారా బాండ్ మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్యాండీ క్రష్, మైన్ క్రాఫ్ట్ వంటి గేమింగ్ యాప్స్‌తో తొలుత వెబ్ ఆధారిత గేమింగ్ స్టోర్‌ను లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం జులైలో ఈ యాప్ స్టోర్ అందుబాటులోకి రానుందని తెలిపారు.