మైక్రోసాఫ్ట్ సరికొత్త రికార్డు… ప్రపంచంలోనే
మైక్రోసాఫ్ట్ సరికొత్త రికార్డు సాధించింది. సత్య నాదెళ్ల సారధ్యంలోని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. మైక్రోసాఫ్ట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచాలు మించడంతో ఒక దశలో కంపెనీ షేరు ఒక శాతానికి పైగా పుంజుకొని 328.7 డాలర్లకు చేరుకుంది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ 2.47 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకింది. అదే సమయంలో యాపిల్ షేరు 2 శాతానికి పైగా క్షీణించి 146 డాలర్ల స్థాయికి పడిపోయింది. కంపెనీ మార్కెట్ విలువ 2.42 లక్షల కోట్ల డాలర్లకు జారుకుంది. యాపిల్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరాశపర్చడం ఇందుకు కారణం.






