అమెరికా మార్కెట్లలోకి మెడ్ టెక్ స్టార్టప్ ఇన్స్టాషీల్డ్
వైరస్, ఫంగస్ సంబంధితాల్లో ప్రత్యేకత కలిగిన అగ్రగామి వైద్య పరికరాల సాంకేతికత స్టార్టప్ అయిన ఇన్స్టాషీల్డ్ అమెరికాలోని మేరీ ల్యాండ్లోని మోంట్గోమెరీ కౌంటీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశానికి ఎననామిక్ డెవలప్మెంట్ ట్రేడ్ మిషన్ సందర్భంలో అమెరికా ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ మద్దతుతో ఈ ముఖ్యమైన ఒప్పందం సాధ్యమైంది. మాంట్గో మెరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ ఎల్రిచ్, అమెరికా ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ సీఈఓ ఎలిషా నేతృత్వంలోని ఈ మిషన్లో అమెరికా నుంచి 25 మందికి పైగా వ్యాపార, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగిన అమెరికా ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ వార్షిక 2023 ఇన్క్రెడిబుల్ ఇంక్ 50 ఈవెంట్లో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ అవగాహన ఒప్పందం అనేక రంగాలలో సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికాలో మార్కెట్ విస్తరణ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సాఫ్ట్ ల్యాండిరగ్, ఆర్జికాభివృద్ధి కార్యక్రమాలను అందించడం, అలాగే విలువైన వ్యాపార, నెట్వర్క్లు, వనరులను పరిచయం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.






