మార్కెట్ అనాలిస్టులకు హెచ్ 1బీ వీసా
అమెరికాలో హెచ్ 1బీ వీసా ఎంప్లాయర్స్కు ఘన విజయం దక్కింది. మార్కెట్ రిసర్చ్ అనాలిస్టులను ప్రత్యేక వృత్తి నైపుణ్య పరిధిలోని వారిగా అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సిఐఎస్) గుర్తించింది. ఈ మేరకు అమెరికా ప్రముఖ సంస్థలతో రాజీకి వచ్చింది. విదేశీ వృత్తి నిపుణులను అమెరికా సంస్థలు హెచ్ 1బీ వీసాల ప్రతిపదికన కీలక ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాయి. పలు వృతి విద్య నైపున్యవంతులకు ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు హెచ్ 1బీ వీసా దరఖాస్తుల నిర్ధారణ విషయంలో మార్కెట్ రిసర్చ్ అనాలిస్టును కూడా పరిగణనలోకి తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు వీసా అధికారిక సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రత్యేక నైపుణ్య జాబితాలో వీరిని యుఎస్సి ఐఎస్ చేర్చలేదు. దీనిపై పలు సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి.
ఈ దశలో సంస్థలకు వీసా సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందాని కాలిఫోర్నియా ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆమోదం తెలిపింది. దీనితో ఇప్పటి వరకూ మార్కెట్ రిసర్చ్ అనాలిస్టులకు నిలిపివేస్తూ వచ్చిన హెచ్1 బీ వీసాల దరఖాస్తులను తిరిగి పరిశీలించేందుకు వీలేర్పడిరది. వివిధ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల పురోగతి దిశలో మార్కెట్ అనాలిస్టుల పోస్టులలో సంబంధిత విద్యార్హతలు ఉన్న వారిని విదేశాల నుంచి వచ్చే వారిని హెచ్ 1బీ వీసాల ప్రతిపాదికన తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి.






