Apple :హైదరాబాద్‌లో యాపిల్ విస్తరణ

ఐఫోన్ (iPhone) తయారీ దిగ్గజం యాపిల్ (Apple) హైదరాబాద్‌లో కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం నానక్‌రామ్ గూడ (Nanakram Guda) , ఐటీ కారిడార్‌లోని వేవ్‌రాక్ టవర్ 2.1 లో 64,125 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని (ఆఫీస్ స్పేస్)ను ఐదేళ్ల కాలానికి లీజు తీసుకున్నది. టీఎస్‌ఐ బిజినెస్ పార్క్స్ (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లీజుకు తీసుకున్న ఈ స్థలం కోసం యాపిల్ ఇండియా నెలకు రూ.80.15 లక్షల అద్దె చెల్లించనున్నది. యాపిల్ హైదరాబాద్ ఆఫీస్‌ను సీఈఓ టిమ్ కుక్ (CEO Tim Cook) 2016 మే నెలలో ప్రారంభించారు. సంస్థ ఇక్కడ యాపిల్ మ్యాప్స్, జియో స్పేషియల్ టెక్నాలజీ, డేటా మోడలింగ్ అభివృద్ధి కార్యకలాపాలు సాగిస్తోంది.