ఇన్ స్టా కొత్త ఫీచర్!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్స్ (ట్విటర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త ఫీచర్స్ పొందుతున్నాయి. తాజాగా మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ఓ చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అదెలా పనిచేస్తుందో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫొటోను లూపింగ్ వీడియోతో నోట్స్‌లో అప్డేట్ చేయగలుగుతారు.






