ఇన్ఫోసిస్ కీలక ప్రకటన… ఇక ఆ టెన్షన్ లేదు!

జనరేటివ్ ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపు జరుగుతోంది. భారత్‌లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగుల తొలగింపుల వల్ల ఐటీ రంగం తీవ్రంగా నష్టపోగా, పలు కంపెనీల ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్పోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఉద్యోగుల తొలగింపులు, ఉద్యోగాల విషయంలో కంపెనీ వైఖరిని స్పష్టం చేశారు. ఇన్పోషిస్‌లో ఎలాంటి తొలగింపు ఉండవని తెలిపారు. ఇన్ఫోసిస్ ఉద్యోగాలను తగ్గించే ఆలోచన చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.