PayPal : పేపాల్‌తో విదేశాల్లోనూ భారత్ యూపీఐ సేవలు

దేశంలో యూపీఐ చెల్లింపులకు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ యూపీఐ (UPI) వినియోగం పెరిగింది. ఒక రకంగా ఇది నిత్య జీవితంలో భాగమైంది. యూపీఐ డిజిటల్ చెల్లింపులు సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లింది. ఇక నుంచి విదేశాల్లోనూ యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయ చెల్లింపులకు వీలుగా గ్లోబల్ పేమెంట్ కంపెనీ (Global Payment Company) పేపాల్ కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చిది. పేపాల్ వరల్డ్ పేరుతో కొత్త ప్టాట్ ఫామ్‌ను ప్రారంభిస్తున్నట్లు పేపాల్ (PayPal) తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద చెల్లింపు వ్యవస్థలు, డిజిటల్ వాలెట్లను అనుసంధానం చేసే లక్ష్యతో దీనికి తీసుకువచ్చినట్లు పేపాల్ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ పేపాల్ పేమెంట్ యాప్ వెన్నో మధ్య ఇంటర్ అపరేబిలిటీని అందిస్తుంది. ఇందులో యూపీఐని చేర్చారు. దీంతో ఇండియా కస్టమర్లు అంతర్జాతీయంగా షాపింగ్ చేయవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. భారత్ (India) లో ఉన్న కస్టమర్ అమెరికా (America)లో ఏదైనా ఆన్‌లైన్ స్టోర్‌లో తనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. చెల్లించే సమయంలో చెక్ అవుట్‌లో పేపాల్ ఆప్షన్ వినియోగిస్తే యూపీఐ బటన్ కనిపిస్తుంది. యూపీఐ అకౌంట్‌తో చెల్లింపులు పూర్తి చేయవచ్చు.