భారత్ మెరుగైన స్థానంలో ఉంది : నిర్మలా సీతారామన్

ప్రపంచ ఆర్థిక వాతావరణ ప్రస్తుత సవాళ్లతో ఉన్నప్పటికీ భారతదేశం కొత్త వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మెరుగైన స్థానంలో ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వస్తు, సేవల వనరుల విషయంలో అనేక దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా మారుతుందనే విశ్వాసం ఉందని అన్నారు. కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించి కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. బాహ్య అంతరాయాలకు వ్యతిరేకంగా నిలబడి తట్టుకునేలా దేశీయంగా భారత్ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అన్నారు.