Lobbying: అమెరికాలో భారత్ రెండో లాబీయింగ్ సంస్థ

మరి కొద్ది రోజుల్లో భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన 50 శాతం సుంకాలు అమలుకానున్న వేళ భారత్ ఆ దేశంలో రెండో లాబీయింగ్ (Lobbying )సంస్థను నియమించింది. మాజీ సెనెటర్ డేవిడ్ విటర్ (David Witter) కు చెందిన లాబీయింగ్ సంస్థ మెర్క్యురీ పబ్లిక్ ఎఫయిర్స్‌ని భారత్ నూతనంగా నియమించినట్లు తెలిసింది. ఈ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. భారత్ ఇప్పటికే అమెరికాలో ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌సీ లాబీయింగ్ సంస్థను 1.8 మిలియన్ డాలర్లకు నియమించింది. మరో వైపు మెర్క్యురీకి నెలకు 75,000 డాలర్ల చొప్పున మూడు నెలలకు చెల్లించనున్నట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక దాదాపు 30 దేశాలు తమ లాబీయింగ్ సంస్థలను అమెరికా (America) లో ఏర్పాటు చేసుకున్నాయి.