31 వరకే ఆధార్ తో పాన్.. లేకపోతే రెట్టింపు

ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు ఈ నెల 31 లోగా తమ పాన్ నంబర్‌ను తమ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఐటీ శాఖ కోరింది. లేకపోతే రెట్టింపు మొత్తంలో మూలంలో పన్ను కోత (టీడీఎస్) ఉంటుందని హెచ్చరించింది. మే 31లోగా పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని ఉంటే, వారు టీడీఎస్‌ను తక్కువగా జమ చేసినా, వారిపై చర్యలు ఉండవని టీ శాఖ గత నెలలో ప్రకటించింది.