Google: ఆ ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్ .. ఆఫీసుకు రాకపోతే

సరికొత్త సాంకేతికత కృత్రిమ మేధపై భారీగా పెట్టుడులు పెడుతున్న టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఖర్చు తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రిటర్న్ టు ఆఫీసు విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సిద్దమైంది. ఇందులోభాగంగానే కొంతమంది రిమోట్ ఉద్యోగుల (Remote employees)కు అల్టిమేటం ఇచ్చింది. వారంతా తిరిగి ఆఫీసులకు రిపోర్ట్ చేయాలని, లేదంటే కంపెనీని వీడేందుకు సిద్ధమవ్వాలని హెచ్చరించింది. ఉద్యోగులు వారానికి మూడు రోజులు (Three days) కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని ఇప్పటికే గూగుల్ తేల్చి చెప్పింది. అయితే, కొన్ని కారణాలరీత్యా కొంతమంది సిబ్బందికి మాత్రం దీనినుంచి మినహాయింపు కల్పించింది. వారికి శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) వెసులుబాటు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ రిమోట్ ఉద్యోగుల్లో కొంతమంది తప్పనిసరిగా హైబ్రీడ్ వర్క్ మోడల్‌కు మారాల్సిందేనని తాజాగా కంపెనీ ఆదేశించింది. లేనిపక్షంలోని కోతలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, లేదంటే స్వచ్ఛందంగా ఎగ్జిట్ ప్యాకేజీ (Exit package) లను ఎంచుకోవచ్చని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.