Google : 11 వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించిన గూగుల్

వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపిస్తూ గూగుల్(Google) దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్ల (YouTube channels)ను తొలగించింది. వీటిలో చైనా, రష్యా (Russia ) కు చెందిన ఛానళ్లు టాప్ లిస్టులో ఉన్నట్లు వెల్లడిరచింది. తొలగించిన వాటిలో కేవలం చైనా (China)కు సంబంధించినవే 7,700 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నట్లు తెలిపింది. అవి భారత్‌లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని, ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ పలు కంటెంట్‌లను పోస్టు చేస్తున్నాయని ఆరోపించింది.
రష్యాకు చెందిన 2,000లకు పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర వెబ్‌సైట్లను తొలగించినట్లు గూగుల్ వెల్లడిరచింది. ఈ ఖాతాల్లో ఉక్రెయిన్ (Ukraine), నాటోలను విమర్శిస్తూ రష్యాకు మద్దతిచ్చేలా సందేశాలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. రష్యాలోని పలు సంస్థలకు కూడా ఈ ఛానళ్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల గూగుల్ 20 యూట్యూబ్ ఛానెల్‌లు, నాలుగు ఖాతాలు, రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థకు సంబంధించిన ఓ బ్లాగును తొలగించినట్లు వివరించింది.