ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ పెట్టుబడులు

ప్రపంచ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాను కొనేందుకు సిద్ధమైంది. సంస్థ తాజాగా చేపట్టిన ఫండిరగ్ రౌండ్ సందర్భంగా గూగుల్ నుంచి ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్టు గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ తెలియజేసింది. ఇరు సంస్థల ఆమోదాలు, ఇతరత్రా అనుమతులకు లోబడి ఈ లావాదేవీ ఉంటుందని చెప్పింది. ఇదిలావుంటే ఈ ఫండింగ్ రౌండ్‌లో 1 బిలియన్ డాలర్లను ఫ్లిప్‌కార్ట్ అందుకోగా, ఇందులో దాని మాతృ సంస్థ వాల్‌మార్ట్ నుంచే 600 మిలియన్ డాలర్లు వస్తున్నాయి. మరో 350 మిలియన్ డాలర్లు గూగుల్ నుంచి రాబోతున్నాయి.