Gmail: జీమెయిల్ లో కొత్త ఫీచర్ .. ఒక్క క్లిక్‌తో చెక్!

గూగుల్‌కు చెందిన ఇ-మెయిల్ సర్వీస్ జీమెయిల్‌లో కొత్త ఫీచర్ (New feature ) అందుబాటులోకి తెచ్చింది. సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా మేనేజ్ సబ్‌స్క్రిప్షన్ పేరిట దీన్ని తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ప్రమోషనల్ ఇ-మెయిల్స్ (Emails) అన్నింటినీ ఒకేచోట చూడొచ్చు. అవసరం లేదనుకుంటే ఒకే క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్ (Unsubscribe) చేయొచ్చు. మీకు నచ్చని ప్రమోషనల్ ఇ -మెయిల్స్ భవిష్యత్‌లో మీ ఇన్‌బాక్స్ (Inbox)లోకి రాకుండా ఈ ఫీచర్ ద్వారా నియంత్రించుకోవచ్చని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ (Blog Post) లో పేర్కొంది. వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌కు అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది.