గ్లాండ్ ఫార్మా జనరిక్ కి అమెరికా అనుమతి
రక్తపోటు (బీపీ) నియంత్రణకు గాను గ్లాండ్ ఫార్మా తీసుకొచ్చిన జనరిక్ ఔషధానికి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ అనుమతి లభించింది. ఆంజియోటెన్సిన్ 11 ఇంజెక్షన్ 2.5 ఎంజీ/ ఎంఎల్ సింగిల్ డోస్ సీసా మార్కెటింగ్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి ప్రాథమిక ఆమోదం వచ్చినట్టు ఈ హైదరాబాదీ ఔషద రంగ సంస్థ తెలియజేసింది. కాగా, తుది అనుమతులు అందిన తర్వాత తమ మార్కెటింగ్ భాగస్వామితో కలిసి ఈ ప్రోడక్ట్‌ను మార్కెట్లో ప్రవేశపెడతామని ఈ సందర్భంగా గ్లాండ్ ఫార్మా స్టాక్ ఎక్స్చేంజీలకు స్పష్టం చేసింది.






