Fitch Rating: భారత్ రేటింగ్ యథాతధం

భారత సార్వభౌమ పరపతి రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ రేటింగ్ (Fitch Rating) ప్రకటించింది. బలమైన వృద్ధితో పాటు విదేశీ నిధులు భారీగా తరలి వస్తుండటం రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించేందుకు దోహదపడ్డాయని తెలిపింది. ఈ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఇండియా (India) కు గతంలో స్థిరమైన వైఖరితో కూడిన బీబీబీ మైనస్ రేటింగ్‌ను కేటాయించింది. పెట్టుబడులకు అనుకూలమైన కనిష్ఠ రేటింగ్ ఇది. కాగా, మరో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ (S&P) ఈ మధ్యనే భారత పరపతి రేటింగ్‌ను బీబీబీ స్థాయికి పెంచింది. కాగా దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రతిపాదిత 50 శాతం సుంకాల ప్రభావం అంతంత మాత్రమేనని ఫిచ్ (Fitch) అభిప్రాయపడింది.