ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికా
ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్) యూనికార్న్ సంస్థలున్న దేశాల్లో ఈ ఏడాది భారత్‌కు మూడో స్థానం దక్కింది. అమెరికా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అమెరికా మొత్తం 134 యూనికార్న్‌లను ఈ విభాగంలో కలిగి ఉంది. బ్రిటన్ 27 ఫిన్‌టెక్ యూనికార్న్‌లతో రెండో స్థానంలో ఉండగా, 17 సంస్థలతో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. మార్కెట్ విలువ పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఫిన్‌టెక్ కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. ఈ దేశానికి చెందిన వీసా, పేపాల్, మాస్టర్‌కార్డ్ వంటివి అంతర్జాతీయ అంకుర వ్యవస్థను శాసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ విలువ ఉన్న 15 ఫిన్‌టెక్ కంపెనీల్లో 8 అమెరికాలో ఉండడం విశేషం. ఈ 8 కంపెనీల మొత్తం విలువ 1.2 లక్షల కోట్ల డాలర్లు కావడం మరో విశేషం.






