చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్
టెస్లా సీఇఒ ఎలోన్ మస్క్ చరిత్ర సృష్టించాడు. ఆయన సంపద ఒక్క రోజే 36.2 బిలియన్ డాలర్లు (రూ.2.71 లక్షల కోట్లు) పెరిగింది. దీనికి కారణం హెర్ట్జ్ గ్లోబల్ హోల్లింగ్స్ నుండి ఆయన కంపెనీ టెస్లాకు లక్ష వాహనాల ఆర్డర్ రావడమే. ఈ ఆర్డర్‌తో టెస్లా షేర్ల విలువ ఒక్కసారిగా 14.9 శాతం పెరిగి 1,045 డాలర్లకు చేరింది. మస్క్ కంటే ముందు చైనీస్ బిలియనీర్ ఒక రోజు అతిపెద్ద సంపద వృద్ధి (32 బిలియన్ డాలర్ల)తో రికార్డును కలిగి ఉన్నాడు. అయితే తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సహ వ్యవస్థాపకుడు, సిఇఒ ఎలాన్ మస్క్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
హెరట్జ్ నుండి ఆర్డర్ వచ్చిందని టెస్లా షేర్లు 15 శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రస్తుతం మస్క్ నికర విలువ 289 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఎక్సాన్ మొబైల్ లేదా నైక్ మార్కెట్ విలువలో మూడిరట ఒక వంతు టెస్లాలో ఆయన వాటా, ఎంపికల నుండి వస్తోంది. నికర విలువ పరంగా మస్క్ అమెరికా అధినేత జెఫ్ బెజోస్‌ను అధిగమించారు. బెజోస్ 193 బిలియన్ల విలువతో రెండో స్థానంలో ఉన్నారు.






