మైగ్రేన్ నొప్పి నివారణకు డాక్టర్ రెడ్డీస్ ఉపకరణం
మైగ్రేన్ (పార్శ్వనొప్పి) చికిత్సలో వినియోగించే వైద్య ఉపకరణాన్ని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ విడుదల చేసింది. నెరివియో అనే ఈ ఉపకరణాన్ని మైగ్రేన్ నొప్పి వచ్చిన గంటలోపు లేదా రోజు మార్చి రోజు మోచేతికి పైన ధరించాలి. అలా చేస్తే నొప్పి నుంచి బయట పడే అవకాశం ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. దీన్లో మందు ఏదీ ఉండదు. రోజూ మందులు వాడే పనిలేకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకునే అవకాశం ఇటువంటి ఉపకరణాల వల్ల లభిస్తుందని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎంవీ రమణ వివరించారు. దీనికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.






