Costco : హైదరాబాద్‌లో అంతర్జాతీయ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ కంపెనీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (Global Capability Center) (జీసీసీ) ఏర్పాటు చేయబోతోంది. అమెరికా (America) కేంద్రంగా పనిచేసే ప్రముఖ రిటైల్ కంపెనీ కాస్ట్‌కో (Costco) హోల్‌సేల్ కార్ప్ ఈ జీసీసీని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ కేంద్రంలో తొలి దశలో వెయ్యి మంది వరకు పని చేసే అవకాశం ఉంది. ఈ జీసీసీ ద్వారా కాస్ట్‌కో హోల్‌సేల్ కార్ప్ తన టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ (ఆర్ అండ్ డీ) కార్యకలాపాలను నిర్వహించనుంది. హైదరాబాద్ (Hyderabad) లో ఇప్పటికే మెక్‌డోనాల్డ్ (McDonalds) , హెనెకిన్, వాన్‌గార్డ్ గ్రూప్ వంటి అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ జీసీసీలు ఏర్పాటు చేశాయి.