చందా కొచ్చర్ కు బెయిల్…కానీ
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ చందా కొచ్చర్‌కు బెయిల్ మంజూరైంది. వీడియోకాన్ గ్రూప్‌నకు 2009-12 మధ్య రూ.3,250 కోట్ల రుణం మంజూరులో ఆమె లబ్ధిపొందినట్లు, ఆమె భర్త కపెంనీల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసిది. చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2020 సెప్టెంబర్‌లో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌ను ఈడీ అరెస్టు చేసింది.
ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్, వీడియోకాన్, ప్రొమోటర్తో పాటు ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆమె పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా చందా కొచ్చర్ పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈడీ స్పందన కోరిన కోర్టు రూ.5 లక్షల పూచికత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని పేర్కొంది.






