హైటెక్స్‌లో బిజినెస్ ఉమెన్ ఎక్స్పో
బిజినెస్ ఉమెన్ ఎక్స్పో 2021 హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. బ్యాక్ బౌన్స్ థిమ్‌తో హైటెక్స్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఏఎల్ఈఏపీ), కాన్ఫిడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ (సీఓడబ్ల్యూఈ) సంయుక్తంగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నాయి. ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ నుండి మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులు, సేవలు ఈ ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు.






