భారత్ బయోటెక్‌కు జీనోమ్ అవార్డు
ప్రతిష్ఠాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు దక్కింది. కొవిడ్ క్యాక్సిన్తోపాటు రేబిస్ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్ తదితర టీకాల తయారీలో భారత్ బయోటెక్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు బయో ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 22న హైదరాబాద్‌లో జరిగే బయో ఏషియా-2021 సదస్సు ప్రారంభం సందర్భంగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా అవార్డును అందుకుంటారని పేర్కొన్నది.






