అందుకే భారత్ పై అధిక దృష్టి : యాపిల్ సీఈవో కుక్
భారత్ వంటి అతిపెద్ద మార్కెట్లో యాపిల్‌కు ప్రస్తుతం చాలా తక్కువ వాటా ఉంది. అంటే భారీ అవకాశాలు ముందున్నాయి. అందుకే భారత్‌పై అధిక దృష్టి కేంద్రీకరిస్తున్నామని అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం, భారత్‌లో మాకు ఆల్‌టైం రికార్డు ఆదాయం నమోదైంది. మేం రెండంకెల వృద్ధిని నమోదు చేశామని 2023 సెప్టెంబరు 30తో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలపై జరిగిన కాన్ఫరెన్స్‌లో కుక్ పేర్కొన్నారు. భారత్‌లో యాపిల్‌కు అసాధారణ మార్కెట్‌ను చూస్తున్నాం. ఆదాయాలు పెరుగుతుండడంతో, చాలా మంది ప్రజలు మధ్యతరగతి ఆదాయ వర్గంగా మారుతున్నారు. చాలా సానుకూలతలు కనిపిస్తున్నాయని అన్నారు.






