యాపిల్ ప్రియులకు శుభవార్త

యాపిల్ ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటితో పాటు మ్యాజిక్ కీ బోర్డు, యాపిల్ పెన్సిల్ ప్రో యాక్సెసరీస్ ను విడుదల చేసింది. ఐప్యాడ్ ప్రోతో పాటు, నెక్ట్స్ జనరేషన్ ఎం4 సిలికాన్‌ను ప్రారంభించింది. ఎం2 చిప్‌తో పోలిస్తే సీపీయూ పని పనితీరును 50 శాతం మెరుగుపరుస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ పాయిల్ ఎం2 చిప్‌తో పని చేస్తుంది. రెండు ఐప్యాడ్‌లు యాపిల్ కొత్త పెన్సిల్ ప్రో, మ్యాజిక్ కీ బోర్డుకు సపోర్టు చేస్తాయి. కొత్తగా లాంచ్‌చేసిన ఐప్యాడ్ ఎయిర్ 11, 13 ఇంచ్ డిస్‌ప్లే ఆఫ్షన్ తో లభిస్తాయి. ఈ రెండు మోడల్స్ యాపిల్ లిక్విడ్ రెటినీ ఐపీఎస్ డిస్‌ప్లే టెక్నాలజీతో వచ్చాయి. ఇందులో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వీటిని రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేశారు. ఐప్యాడ్ ఎయిర్ బ్లూ, పర్పుల్, స్టోర్‌లైట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి. 128 జీబీ స్టోరేజీతో ఈ బేస్ మోడల్ ప్రారంభమవుతుంది. ఐప్యాడ్ ఏయిర్ 1టీబీ వరకు స్టోరేజ్ ఆఫ్షన్‌లలో లభిస్తుంది.