Apple : భారత్‌లో యాపిల్ స్టోర్.. ఎక్కడంటే ?

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ (Apple) భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. మన దేశంలో నాలుగో యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర (Maharashtra )లోని పుణెకు చెందిన కొరెగావ్ పార్క్ (Maharashtra) లో సెప్టెంబర్ 4న దీనిని ప్రారంభించనుంది. అలాగే స్టోర్‌కు సంబంధించిన తొలి చిత్రమూ విడుదలైంది. ఈ స్టోర్ 10వేల చదరపు అడుగుల వైశాల్యంలో విస్తరించి ఉంటుందని తెలుస్తోంది. కొత్త ఐఫోన్ 17 లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ ప్రారంభంపై ప్రకటన వచ్చింది. ఇప్పటికే ముంబయి, ఢల్లీి, బెంగళూరులో స్టోర్లు ఉన్నాయి. భారత్‌లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవకాశాలున్నాయని గతంలో వ్యాఖ్యానించిన యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ (Tim Cook ) అందుకు అనుగుణంగా దేశంలో నాలుగు రిటైల్ స్టోర్లు నెలకొల్పుతామని చెప్పిన సంగతి తెలిసిందే.