అమెరికాకు చెందిన సంస్థ భారీ పెట్టుబడి… రూ.3400 కోట్లతో
అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ఏఎండీ (అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్), మనదేశంలో అతిపెద్ద సెమీకండక్టర్ డిజైన్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. బెంగళూరులో 400 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3400 కోట్ల) వ్యయంతో ఈ సెంటర్ ఏర్పాటవుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏఎండీ నిర్మిస్తున్న చిప్ డిజైనింగ్ కేంద్రంలో 3,000 మందికి పైగా సెమీకండక్టర్ డిజైన్ ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ప్రస్తుతం భారత్లోని 9 ప్రాంతాల్లో ఏఎండీకి 6500 మంది నిపుణులున్నారు. రాబోయే అయిదేళ్లలో భారత్లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని గత జులైలో ఏఎండీ ప్రకటించిన సంగతి విదితమే.






