ఉద్యోగులకు అమెజాన్ మరోసారి షాక్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగం లో కోతలకు తెరతీసింది. లేఆఫ్స్‌కు సంబంధించి సదరు ఉద్యోగులకు సంస్థ మెయిల్ ద్వారా సమాచారం అందించింది. మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విభాగంలో కొన్ని వందల మందిని తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు సదరు ప్రతినిధి నిరాకరించారు.






