Air India : ఎయిరిండియా స్పెషల్ ఆఫర్

దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. బిజినెస్ క్లాస్(Business Class) , ప్రీమియం ఎకానమీ క్లాస్ (Economy Class) టిక్కెట్లపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలలో ఈ ఆఫర్‌ను అందిస్తోంది. దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చారు. ఇందులో ప్రీమియం ఎకానమీ రౌండ్ ట్రిప్ ధర రూ13,000 నుంచి ప్రారంభం అవుతుంది. బిజినెస్ క్లాస్ టికెట్లు రూ.34,400 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తమ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ (Mobile app) లో బుక్ చేసుకునే వారికి అదనపు రాయితీలు లభిస్తాయని కంపెనీ వెల్లడిరచింది. ఫ్లై ఏఐ అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించి ప్రతి టిక్కెట్‌పై రూ.2400 వరకు డిస్కౌంట్ పొందొచ్చని, వీసా కార్డుతో బుకింగ్ చేసుకున్న వారికి ఈ కోడ్ ద్వారా రూ.2500 వరకు రాయితీ లభిస్తుందని ఎయిరిండియా తెలిపింది.