చైనా పై అమెరికా ఆంక్షలు
చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం క్రమంగా ముదురుతోంది. చైనాను ఎలాగైనా కట్టడి చేయాలని భావిస్తున్న అమెరికా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ముందుగా తమ నుంచి అనుమతి తీసుకోకుండా చైనాకు అడ్వాన్స్డ్ కృత్రిమ మేథ ఎలక్ట్రానిక్ చిప్‌లను సరఫరా చేయడం వెంటనే నిలిపివేయాలని ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. చైనాతో పాటు రష్యా, ఇరాన్ సహా మొత్తం 40 దేశాలకు ఏఐ చిప్‌లను ఎగుమతి చేయవద్దనీ అమెరికా అక్టోబర్ 17న ఎన్విడియాను ఆదేశించింది. అమెరికా ప్రభుత్వం ఆంక్షల వల్ల తమ కంపెనీ ఆదాయంపై స్వల్ప కాలంలో పెద్దగా ప్రభావం ఉండదని ఎన్విడియా తెలిపింది. 2022 అక్టోబర్‌లోనే ఏఐ చిప్‌ల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో చైనాకు మాత్రమే ప్రత్యేకమైన ఏ800, హెచ్ 800ను తయారు చేసి విక్రయిస్తోంది. తాజాగా వీటిని కూడా ఎగుమతి చేయడం నిలిపివేయనుంది.






