Innovation Center : హైదరాబాద్‌లో ఏబీసీ ఇన్నోవేషన్ సెంటర్

ఫిట్‌నెస్ బిజినెస్‌కు సంబంధించి అంతర్జాతీయంగా టెక్నాలజీ సేవలు అందిస్తున్న అమెరికాకు చెందిన ఏబీసీ ఫిట్‌నెస్ భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్(Innovation Hub)ను నెలకొల్పింది. సాఫ్ట్‌వేర్(Software) , ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌పై మరింత దృష్టి సారించడంలో భాగంగా ఈ సెంటర్‌ను నెలకొల్పినట్టు, దీంతో తొలి ఏడాదిలో 200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడిరచాయి. ప్రొడక్ట్ ఇన్నోవేషన్, వరల్డ్- క్లాస్ టెక్నాలజీ సేవలు అందించడానికి ఈ సెంటర్ ఉపయోగపడనున్నదన్నారు.