ASBL NSL Infratech

ఈ ఎన్నికల్లో నేను ఓడానంటే.. నేరం గెలిచినట్టే : వైఎస్ షర్మిల

ఈ ఎన్నికల్లో  నేను ఓడానంటే.. నేరం గెలిచినట్టే : వైఎస్ షర్మిల

ఇవి న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ  ఈ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ ఓడిరదంటే, నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్సేనని ఆరోపిస్తున్నారు. ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేకపోతే ఏఏజీ సుధాకర్‌ రెడ్డి చేర్పించారు. మూడు కోర్టుల్లో పిటిషన్లు వేయించారు. సుధాకర్‌ రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్‌ఆర్‌ పేరును సీబీఐ ఛార్జ్‌ షీట్‌లో చేర్చింది. ఆ కేసుల నుంచి జగన్‌ బయటపడాలంటే ఆయన పేరును ఛార్జిషీట్‌లో చేర్చాలనేది వారి ఉద్దేశం.  కుమారుడై ఉండి కూడా తండ్రి పేరును చేర్పించారు. ఇలా ఎవరైనా చేస్తారా? ఎంత దుర్గార్గమిది. సీఎంగా  బాధ్యతలు చేపట్టిన ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవిని జగన్‌ కట్టబెట్టారు. తండ్రి పేరు ఛార్జిషీట్‌లో చేర్పించిన దుర్మార్గం గురించి ఆంధ్రా ప్రజలు ఆలోచించాలి. గత పదేళ్లుగా జగన్‌ రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని మోదీ చేతిలో ఉంది అని మండిపడ్డారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :