ASBL NSL Infratech

జగన్ ప్రకటన వెనక ఆత్మ విశ్వాసమా...? అతివిశ్వాసమా..?

జగన్ ప్రకటన వెనక ఆత్మ విశ్వాసమా...? అతివిశ్వాసమా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ బహిరంగంగా ప్రకటించారు. తాను గెలిచిన తర్వాత విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం తోటే తన సీఎం బాధ్యతలు తీసుకుంటానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్ఛాపురంలో నిర్వహించినటువంటి రోడ్ షోలో జగన్ ప్రకటించారు. అధికార వికేంద్రీకరణ చేసి పాలన సజావుగా జరిగేలా చూసానని జగన్ చెప్పారు. అలా చేయడం వన్నీ ప్రభుత్వ పాలన పేదవాడి వద్దకు వచ్చిందని జగన్ అన్నారు. శ్రీకాకుళం అందువల్లే ప్రభుత్వ పాలన ప్రజల చెంతకు చేరిందన్నారు సీఎం జగన్..

ఇంతవరకూ బాగానే ఉంది .. కానీ తన ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే చేస్తానని సీఎం జగన్ ప్రకటించడం వెనక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సీమ జిల్లాల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు రావడం పక్కా అని జగన్ భావిస్తున్నారు. ఇక విపక్ష కూటమికి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో అధికస్థానాలు దక్కే అవకాశముండే పరిస్థితి ఉంది. అందుకే విశాఖను ముందు పెట్టుకుని జగన్ వస్తున్నారు. రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్.. ఉత్తరాంధ్ర, తమను ఆదుకుంటుందని విశ్వసిస్తున్నారు.

క్యాపిటల్ గా విశాఖను చేస్తామని ప్రకటించడం ద్వారా .. ఉత్తరాంధ్రుల ఓట్లు తమకు పడితే విజయం పక్కా అని జగన్ భావనగా తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలున్నాయి. అవి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం. ఈజిల్లాల్లో దగ్గర దగ్గర 35 స్థానాలవరకూ ఉన్నాయి. ఈస్థానాల్లో అత్యధికం సీట్లు సాధిస్తే..నేరుగా అధికారపగ్గాలు దక్కే పరిస్థితి ఉంది.

అందుకే జగన్..ఈసారి ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఉత్తరాంధ్రలో చూస్తే... క్యాపిటల్ వస్తుందంటుంటే.. అక్కడి ప్రజల్లో ఆనందం కనిపిస్తోంది. కానీ.. అది మాటలకే పరిమితమవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఏదీ మాజిల్లాల్లో ఎక్కడ, ఎలాంటి అభివృద్ధి జరిగిందని ప్రశ్నిస్తున్నారు. వారిలో ఆ భావన పోగొట్టగలిగితే, వైసీపీకి మంచి అవకాశముంటుంది. కానీ.. అది అంత ఈజీకాదన్నది జగమెరిగిన సత్యం..

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :