ASBL NSL Infratech

భారత్ లో చైనాకు కొత్త రాయబారి

భారత్ లో చైనాకు కొత్త రాయబారి

సీనియర్‌ దౌత్యవేత్త షూ ఫెయిహాంగ్‌ను భారత్‌కు కొత్త రాయబారిగా చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌ నియమించారు. తూర్పు లడఖ్‌పై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు స్తంభించడంతో దాదాపు 18 మాసాల సుదీర్ఘ జాప్యం అనంతరం ఈ చర్య తీసుకున్నారు. చైనా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఫెయిహాంగ్‌ గతంలో ఆఫ్ఘనిస్తాన్‌,  రొమేనియాలకు రాయబారిగా పనిచేశారు. తన కొత్త పోస్టింగ్‌ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన త్వరలో ఢిల్లీ వెళతారని భావిస్తున్నారు.  2022 అక్టోబరులో తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న చైనా దౌత్యవేత్త సున్‌ వెడాంగ్‌ స్థానంలో ఈయన బాధ్యతలు చేపడతారు. సైనిక ప్రతిష్టంభన పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న సైనిక, దౌత్య చర్యలు, సంప్రదింపుల నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :