ASBL NSL Infratech

అభివృద్ధిపై ఎవరిది పేటెంట్..?

అభివృద్ధిపై ఎవరిది పేటెంట్..?

ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో సీఎం జగన్ గేర్ మార్చారు. ఇన్ని రోజులు సంక్షేమం, బటన్ నొక్కాను ఓటేయండి అని ఓటర్లను అభ్యర్థించిన సీఎం జగన్ ఇప్పుడు తాము అభివృద్ధి చేశామంటున్నారు. తాము చేసిన అభివృద్ధి చూడండంటున్నారు. నాడునేడు, అమ్మఒడి, ఆస్పత్రులు. ఆర్బీకేలు.. ఇలా తాము ఇన్నిరకాలుగా అభివృద్ధి చేశామంటున్నారు. తాము చేసిన అభివృద్ధిని ఇలా నేరుగా చూపిస్తున్నామని.. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏదని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి తమతోనే అభివృద్ధని సీఎం జగన్ చెబుతున్నారు.

అయితే టీడీపీ వాదన మరోలా ఉంటోంది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఆపార్టీ చెప్పుకుంటోంది. ఎందుకంటే చంద్రబాబు మాట్లాడితే చాలు 2020, 2047 అంటూ ఓ బ్లూప్రింట్ గురించి మాట్లాడుతుంటారు. ఆయన అనుకున్న విధంగానే 2020 లక్ష్యాలు చాలా వరకూ సాధించారని.. ఇప్పుడు గెలిపిస్తే 2047 దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తారని సైకిల్ నేతలు చెబుతున్నారు. చంద్రబాబును గెలిపిస్తేనే.. రాష్ట్రం ఒడ్డున పడుతుందని.. యువతకు జాబ్స్ వస్తాయని వివరిస్తున్నారు. గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని సైతం ఏకరువు పెడుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ... ఏపాటిదో అందరికీ గుర్తుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్, మెట్రో, క్రీడా మైదానాలు.. ఇలా అన్నింటిలో రాష్ట్రం ముందుకెళ్లిందని చరిత్ర తీస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ హయాంలో నేరాంధ్రగా మాత్రం దూసుకెళ్తోందంటున్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధిపథంలో ముందుకెళ్లాలంటే చంద్రబాబు మాత్రం చేయగలడంటున్నారు. కాబట్టి చంద్రబాబునే ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు.

పార్టీలు ఎలా తిట్టుకున్నా.. ఓవిషయంలో మాత్రం రాష్ట్రంలో కాస్త సానుకూలమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా కులం, సంక్షేమం అంటూ రాజకీయాలు చేసిన పార్టీలు ఇప్పుడు అభివృద్ధి మంత్రం జపించడం చెప్పుకోదగిన పరిణామం. అంటే అటు టీడీపీ, ఇటు వైసీపీలకు అభివృద్ధికి కూాడా ఓ ఓటుబ్యాంక్ ఉందన్న విషయం అర్థమైందన్నమాట. ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలను గెలిపించలేకున్నా.. గెలుపులో వాటిపాత్ర పార్టీలకు అర్థమైతే అంతే పదివేలన్నమాట.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :