ASBL NSL Infratech

త్వరలో అమెరికా వెళ్లే విద్యార్థులకు వీసా స్లాట్లు

త్వరలో అమెరికా వెళ్లే విద్యార్థులకు వీసా స్లాట్లు

విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండో వారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలో ఫాలో సీజన్‌కు సంబంధించిన సెమిస్టర్‌ ఆగస్టు-సెప్టెంబరు మధ్య ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళుతుంటారు. వీసా ఇంటర్వ్యూ తేదీల కోసం గత కొంత కాలంగా ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు దేశం లోని రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, ముంబయి కాన్సులేట్‌ కార్యాలయాల్లో విద్యార్థులకు సేవలు అందించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్‌ లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం అధికార ప్రతినిధి తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :