ASBL NSL Infratech

ఇజ్రాయెల్ కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా

ఇజ్రాయెల్ కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా

అమెరికా మాటలను పెడచెవిన పెట్టి గాజాలోకి చొచ్చుకెళుతున్న ఇజ్రాయెల్‌కు ఓ షాక్‌ ఎదురైంది. వాషింగ్టన్‌ నుంచి అందాల్సిన కీలక ఆయుధాల షిప్‌మెంట్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఒక్కోటి 900 కేజీల బరువుండే 1,800 బాంబులు, 226 కేజీల బరువుండే మరో 1,700 బాంబులు ఇప్పుడు టెల్‌అవీవ్‌కు అందవు. ఈ విషయాన్ని బైడెన్‌ కార్యవర్గంలోని కీలక అధికారి ధ్రువీకరించారు. రఫాలో పౌరుల బద్రత, వారికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళనలు పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఆపరేషన్‌పై అమెరికా మొదటి నుంచి అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :