ASBL NSL Infratech

రష్యా కుట్రను చేధించాం : ఉక్రెయిన్

రష్యా కుట్రను చేధించాం : ఉక్రెయిన్

తమ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ కుట్రకు సంబంధించి దేశంలోని అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్‌ గార్డ్‌ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ పన్నిన హత్యా ప్రణాళిక అమలులో వారిది అనుమానాస్పద పాత్ర ఉన్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2022లో ఆ కర్నల్స్‌ను విధుల్లోకి తీసుకున్నట్టు ఓ ప్రకటన వివరించింది. గతంలో కూడా జెలెన్‌స్కీ అంతానికి రష్యా పలుమార్లు కుట్ర పన్నినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :