తండేల్పై ఇంట్రెస్టింగ్ లీక్
లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ఇంకా చాలా సమయముండటంతో ఎలాంటి హడావిడి లేకుండా షూటింగ్ ను ఫినిష్ చేస్తుంది చిత్ర యూనిట్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో చైతూ తన కెరీర్లో ఎన్నడూ లేనంత మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. పడవలు నడుపుతూ చేపలు పట్టే ఓ మామూలు యువకుడు ప్రాణాలను పణంగా పెట్టి మరీ పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందోననే పాయింట్ మీద ఈ కథ నడవనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ లీక్ సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
తండేల్ కోసం చందూ మొండేటి రెండు క్లైమాక్స్ లను పరిశీలిస్తున్నాడట. చైతూ- సాయి పల్లవి మధ్య ప్రేమను ఎలా ముగించాలనే దాని మీద ప్రస్తుతానికి చందూ రెండు వెర్షన్స్ రాసుకున్నాడట. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దానిపై విశ్లేషించి ఆ తర్వాత డెసి స్తోంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చైతూ, సాయి పల్లవి యాక్టింగ్ పీక్స్ లో ఉంటుందని టాక్. మరి హ్యాపీగా ముగిస్తారా లేదా విచారంగా ముగిస్తారా అనేది వేచి చూడాలి.