ASBL NSL Infratech

అమెరికా వర్సీటీల్లో మొదలైన ఆందోళనలు

అమెరికా వర్సీటీల్లో మొదలైన ఆందోళనలు

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడికి నిరసనగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి.  మంగళవారం తెల్లవారు జామున న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలోని హామిల్టన్‌ హాల్‌ భవంతిని విద్యార్థి నిరసనకారులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. భవంతిలోకి ఎవరూ రాకుండా బ్యారికేడ్లు అడ్డుపెట్టి కిటీకీల్లో  పాలస్తీనా జెండాలను ఎగరేశారు. టెక్సాస్‌, ఉతా, వర్జీనియా, న్యూజెర్సీల్లోని వర్సిట్లీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చర్చలు సంప్రదింపులు విఫలమై చివరకు పోలీసులు కలగజేసుకుని చాలా మంది విద్యార్థులను అరెస్ట్‌ చేస్తున్న దృశ్యాలే అంతటా కనిపిస్తున్నాయి. నిరసనకు దిగిన విద్యార్థుల సస్పెన్షన్‌ ప్రక్రియ మొదలైందని కొలంబియా వర్సిటీ తెలిపింది. ఆస్టిన్‌లోని టెక్సాస వర్సీటీలో మరో 40 మందిని అరెస్ట్‌ చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :