ASBL NSL Infratech

రివ్యూ: యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'రౌడీ బాయ్స్'

రివ్యూ: యూత్ ఫుల్ ఎంటర్ టైనర్  'రౌడీ బాయ్స్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
బ్యానెర్లు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్
నటీనటులు: ఆశిష్, అనుపమ పరమేశ్వరన్, సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్.
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మదీ
ఎడిటర్ : మధు, నిర్మాత: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం : హర్ష కొనుగంటి
విడుదల తేదీ: 14.01.2022

దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆశిష్ హీరోగా పరిచయమవుతూ.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘రౌడీ బాయ్స్’. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా  నటించిన ఈ సినిమాని ‘హుషారు’ చిత్రంతో యూత్ లో హుషారు నింపిన హర్ష కొనుగంటి తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాల్ని పెంచేసిన ఈ సినిమా యువతరానికి ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుంది? ఆశిష్ హీరోగా టాలీవుడ్ లో స్థిరపడేందుకు ఈ సినిమా ఏమేరకు దోహదపడుతుంది అనే విషయాలు రివ్యూలో చూద్దాం..

కథ:
అక్షయ్ (ఆశిష్) ఇంజినీరింగ్ స్టూడెంట్, కావ్య (అనుపమ పరమేశ్వరన్) మెడికల్ కాలేజీ స్టూడెంట్. అయితే, ఇంజినీరింగ్ , మెడికల్ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్షయ్, కావ్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేయడానికి అక్షయ్ రిస్క్ చేసి మరీ మెడికల్ స్టూడెంట్స్ తో గొడవలకు దిగుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కావ్య, అక్షయ్ తో లివింగ్ రిలేషన్ తో ఉండటానికి అంగీకరిస్తోంది. ఆ తర్వాత వీరి ప్రేమకథ ఎలా సాగింది ? అక్షయ్, కావ్యకి దూరం అవ్వడానికి గల కారణం ఏమిటి ? ఊహించని పరిస్థితుల మధ్య అక్షయ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ? చివరకు అక్షయ్,  కావ్య ఒకరి కోసం ఒకరు ఏమి చేశారనేది మిగిలిన కథ.

నటి నటుల హావభావాలు:
అక్షయ్‌గా ఆశిష్ అదరగొట్టాడు.  తనకు మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. ఆశిష్ పెర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. అలాగే ఆశిష్ డైలాగ్ మాడ్యులేషన్, కామెడీ టైమింగ్ కూడా చాలా బాగున్నాయి.  హీరోకి కావల్సిన లక్షణాలన్నీ అతడిలో పుష్కలంగా ఉన్నాయి. డ్యాన్స్, యాక్షన్ సీన్స్ లో ఎంతో అనుభవమున్నట్టు నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో కొంచెం మెరుగుపడాలి. తొలి చిత్రమైనా ఎక్కడా తడబడకుండా.. మంచి ఈజ్ చూపించాడు. అలాగే... విక్రమ్ గా విక్రమ్ సహిదేవ్ సహజనటనతో ఆకట్టుకున్నాడు. ఫైట్స్ లోనూ, నెగెటివ్‌ షేడ్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. ఇక కథానాయికగా అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏముంది? అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది. తన కెరీర్ లోనే బోల్డెస్ట్ కేరెక్టర్ ను ఆమె చేసిందని చెప్పాలి. కేవలం పాటలకి, గ్లామర్ కే పరిమితమై పోకుండా.. చాలా కీలకమైన పాత్రను చేసింది ఆమె.ఇక అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు ప్రాణం పోసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో సాగే సన్నివేశాలు అలాగే క్లైమాక్స్ లో అనుపమ నటన చాలా బాగుంది.  హీరో తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్, హీరోయిన్ తండ్రిగా జయప్రకాశ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :
శ్రీహర్ష కొనుగంటి రాసిన కథ మరియు పాత్రలు కాలేజీ లైఫ్ ను, స్టూడెంట్స్ జీవితాల్లోని సంఘటనలను బాగా ఎలివేట్ చేశాయి. ఫస్టాఫ్ కాలేజీ నేపథ్యంలోని సన్నివేశాలతోనే కథను నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ ను పూర్తిగా హీరో, హీరోయిన్స్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ వైపు వెళ్ళిపోయాడు. ఆ సన్నివేశాల్ని బాగానే హ్యాండిల్ చేశాడు దర్శకుడు.  అయితే సన్నివేశాల్లో కానీ, డైలాగ్స్ లో కానీ ఎక్కడా వల్గారిటీ అన్నదే లేకుండా సినిమాని తెరకెక్కించిందుకు దర్శకుడ్ని అభినందించితీరాలి.ఇక దేవీశ్రీ సంగీతం సినిమాకి అదనపు బలాన్ని తెచ్చిపెట్టింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కో్ర్స్ లో దేవీ మార్క్ కనిపించింది.  సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ఎసెట్ అయింది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ:
దిల్‌‌రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ తమ్ముడి తనయుడు కావడంతో.. హీరోగా ఆశిష్‌ లాంఛింగ్ దానికి తగ్గ రీతిలోనే జరిగింది. హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్, సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసి.. సినిమాకి విడుదలకు ముందే మంచి క్రేజ్ తీసుకొచ్చారు. ఆ ప్రయత్నంలో ‘హుషారు’ లాంటి సినిమా తీసిన దర్శకుడు హర్ష కొనుగంటిపై పెద్ద బాధ్యతనే ఉంచారు. ఒక సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో తొలి చిత్రానికి కావాల్సిన అన్ని హంగులూ ఇందులో ఉన్నాయి. డ్యాన్స్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ లాంటి వన్నీ కలగలిసే ఒక యూత్ ఫుల్ స్టోరీని దర్శకుడు ఎంచుకున్నాడు. కొన్ని ఎపిసోడ్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇప్పటి యూత్ ఒకమ్మాయి ప్రేమకోసం ఏరూట్లో వెళుతున్నారు? ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య రైవలరీ ఏ స్థాయిలో ఉంటుంది? అయితే కథనంపై ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేది. రౌడీ బాయ్స్’ అంటూ వచ్చిన ఈ కాలేజీ ట్రెండీ ఎమోషనల్ డ్రామాలో కాలేజీ నేపథ్య సన్నివేశాలు, అలాగే స్టూడెంట్ లైఫ్ లో చేసే పొరపాట్లు తాలూకు పర్యవసానాలను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, రెగ్యులర్ ప్లే, కొన్ని బోరింగ్ సన్నివేశాలు..ఇంకా బాగా ఉండాల్సింది.  కాకపొతే యూత్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది . నేటి యూత్ కి టోటల్ గా ‘రౌడీ బాయ్స్’ మెప్పిస్తారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :