ASBL NSL Infratech

దేవ‌ర‌లో అలాంటి రొమాంటిక్ సాంగ్

దేవ‌ర‌లో అలాంటి రొమాంటిక్ సాంగ్

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా  తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై ఆడియ‌న్స్ లో చాలా అంచ‌నాలున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ కాంబోకి ఫ్యాన్స్ లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్, శ్రీదేవి క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే.

వారిద్ద‌రి కాంబోలో ఎన్నో రొమాంటిక్ సాంగ్స్ కూడా వ‌చ్చాయి. ఇప్పుడు జూ. ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ ఇద్ద‌రూ క‌లిసి రొమాంటిక్ సాంగ్ లో ఆడిపాడ‌బోతున్నారు. వేట‌గాడు సినిమాలోని ఆకు చాటు పిందె త‌డిసే పాట లాంటి స్పెష‌ల్ సాంగ్ ను దేవ‌ర‌లో జూ.ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ తో ప్లాన్ చేస్తున్నాడ‌ట డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. దేవ‌ర లో రొమాంటిక్ సాంగ్ అన‌గానే ఆకు చాటు పిందె త‌డిసే సాంగ్‌నే రీమిక్స్ చేస్తే బావుంటుంది క‌దా అని చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుత‌న్నారు.

కానీ ఆ పాట ఇప్ప‌టికే రీమిక్స్ అయింది కాబ‌ట్టి తార‌క్ మ‌ళ్లీ ఆ ఆలోచ‌న చేయ‌డు. కాబ‌ట్టి ఆ సాంగ్ కాక‌పోయినా వారిద్ద‌రి కాంబోలో ఏ సాంగ్ వ‌చ్చినా దాన్ని మించేలా ఉంటుంద‌ని యూనిట్ వ‌ర్గాలంటున్నాయి. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న దేవ‌ర‌కు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా, మొద‌టి భాగం అక్టోబ‌ర్ లో రిలీజ్ కానుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :