ASBL NSL Infratech

అమిత్ షా ఫేక్ వీడియో తో నాకు సంబంధం లేదు..రేవంత్ రెడ్డి..

అమిత్ షా ఫేక్ వీడియో తో నాకు సంబంధం లేదు..రేవంత్ రెడ్డి..

అమిత్ షా ఫేక్ వీడియో కేస్ లో ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన రేవంత్ రెడ్డి ఆ నోటీసులకు సమాధానం పంపించారు. తనకు ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అని రేవంత్ రెడ్డి తరఫు అడ్వకేట్ సౌమ్య గుప్తా ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చారు. INC ట్విట్టర్ ఖాతాను రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయడం లేదని.. అతనికి దానికి ఎటువంటి సంబంధం లేదని తెలియపరచారు. రేవంత్ రెడ్డి పేరిట పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ తో పాటు తెలంగాణ సీఎంవో అకౌంట్స్ మాత్రమే ఉన్నా యని ఢిల్లీ పోలీసులకు సౌమ్య గుప్తా క్లారిటీ ఇచ్చారు. రిజర్వేషన్ అంశంపై అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేస్ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ఛైర్మన్ మన్నె సతీష్‌, స్టేట్ సెక్రటరీ శివకుమార్ తో సహా పలువురు నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించారు. మే 1న విచారణకు హాజరుకావాలని కోరగా.. రేవంత్ రెడ్డి తన లాయర్ ద్వారా విచారణ ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అస్సాంలో అదుపులోకి తీసుకోగా.. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క సికింద్రాబాద్ శాంతినగర్ కు చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీత సెల్ ఫోన్ ని కూడా ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసు విషయంలో గీతకు CRPC-41 A సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :