ASBL NSL Infratech

బస్సులో ప్రయాణిస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ..

బస్సులో ప్రయాణిస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ..

తెలంగాణలో కేసీఆర్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కేటీఆర్, బీఆర్ఏస్ నేతలు అదే పనిగా కాంగ్రెస్ ను విమర్శిస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ అందిస్తున్న పథకాలకు సంబంధించి ఏది సజావుగా సాగడం లేదు అని కేటీఆర్ అనుక్షణం ఎత్తి పొడుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ని ఓడించాలి అని కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీని అడ్డుకోవడానికి.. లోక్ సభ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటడానికి రేవంత్ రెడ్డి వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత.. రాహుల్ గాంధీతో గురువారం నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన జన జాతర సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

సరూర్‌నగర్ జన జాతర సభ పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సిటీ బస్సు ఎక్కి సందడి చేశారు. ఈ ఇద్దరు దిలుసుఖ్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కడం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలను అందించి వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ జరగాలన్న.. రిజర్వేషన్లు కొనసాగాలన్న.. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి వినూత్నంగా తెలంగాణలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎలా ఉందో రాహుల్ గాంధీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లతో ప్రయాణికులు ఫోటోలు దిగి..వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :